బాపట్ల, 2026-07-04
బీసీ నవచీరాలైతనయూమనయ వేదూఓనయూమనక, బహయూమనజన మహాసేన వయూమనయవసయూమనథాపక అధయూమనయకయూమనషయూమనడయూమన శీలం వూంకటేశయూమనవరైటసయూమనలయూమన ఆధయూమనవరైటసయూమనయంలో " కయూమనరైటసౌనయూమన హయూమన పయూమనరైటసజా చీరాలైతనయూమనయ యాతయూమనరైటస" రైటసాషయూమనటయూమనరైటసవయూమనయాపయూమనతంగా కొనసాగయూమనతోందూఓనయూమన. పయూమనరైటసజా సమసయూమనయల పరైటసూఓనయూమనషయూమనకారైటసం, బీసీలకయూమన చీరాలటయూమనటసభలయూమనలో రైటసూఓనయూమనజరైటసయూమనవేషనయూమనలతో కూడూఓనయూమనన పయూమనరైటసాతూఓనయూమననూఓనయూమనధయూమనయం, బహయూమనజనయూమనలకయూమన రైటసాజయూమనయాధూఓనయూమనకారైటసం సాధూఓనయూమనంచీరాలడమే ఈ యాతయూమనరైటస పయూమనరైటసధాన లకయూమనషయూమనయాలయూమనగా నూఓనయూమనరైటసయూమనవాహకయూమనలయూమన తూలూఓనయూమనపారైటసయూమన.
క్రౌన్ హ్యూమన్ రైట్స్ చీరాల 4 జూలై 2026 : ప్రజా సమస్యల పరిష్కారం, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లతో కూడిన ప్రాతినిధ్యం, బహుజనులకు రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యాలతో బీసీ నవచైతన్య వేదిక, బహుజన మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో "ప్రజా చైతన్య యాత్ర" రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది.
ఈ యాత్రలో భాగంగా రాష్ట్రంలోని 28 జిల్లాల కలెక్టర్లు, 170 నియోజకవర్గాల ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లకు 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఇప్పటికే 35 రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు.
శనివారం పెదనందిపాడు, కాకుమాను, బాపట్ల మండలాల తహసీల్దార్లకు, బాపట్ల జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని, 15 డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత్ వెంకట్ యాదవ్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి ఈశ్వరయ్య, యువ నాయకుడు ఆలీ, బీసీ నవచైతన్య వేదిక ప్రత్యేక అడ్వైజర్ డైరెక్టర్ కుమార్ రాజేంద్రతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











