ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వివరణ ఇవ్వాలని రాజకీయ పార్టీలు, వ్యక్తులు కోరుతున్నారు. గతంలో ఈవీఎంలు, వీవీప్యాట్ల పారదర్శకతపై వివిధ రాజకీయ పార్టీలు, వ్యక్తులు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మన దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యమైనవి. ఎన్నికల ప్రక్రియపై ప్రజలలో విశ్వాసం ఉండటం కూడా అంతే అవసరం. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్‌లో ఇద్దరు సభ్యులు ఎస్ఐఆర్ ప్రక్రియ అమలులో అభ్యంతరాలను వ్యక్తం చేయడం ఓటర్లలో విశ్వాసం కోల్పోయే స్థితికి దారితీయడం మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయ పార్టీల డిమాండ్
రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుందని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వివరణ ఇవ్వాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల ఓటు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నమోదై, లెక్కించబడుతుందనే విశ్వాసాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌దేనని స్పష్టం చేస్తున్నారు.











