Dr. B.R. Ambedkar Konaseema/Atreyapuram (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 18
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (DNR) ఆధ్వర్యంలో 'జగన్ 2.0 సూపర్ యాప్'ను ఏలూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయం పెంపొందించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశ్యం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (DNR) ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయం పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన 'జగన్ 2.0 సూపర్ యాప్'ను ఏలూరు రోడ్డులోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా DNR మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో సమాచార మార్పిడిని వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ యాప్ రూపొందించబడిందని తెలిపారు. దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో నేరుగా అనుసంధానం అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు చేసే పోస్టులు తొలగించడం, వాటిపై కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి కార్యకర్తలకు ఒక సమగ్ర డిజిటల్ వేదిక అవసరమని భావించి, వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు 'జగన్ 2.0 సూపర్ యాప్'ను తీసుకువచ్చారని వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ గారు, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి సోషల్ మీడియా విభాగ నాయకులు పాల్గొన్నారు.












