పర్చూరు, 13 September
పుట్టుకతోనే 70 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగుడు బి. మనోజ్ బాబు, పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా, తన ఆధార్‌తో మూడు జిల్లాల్లో 16 విద్యుత్ కనెక్షన్లు నమోదైనట్లు గుర్తించారు. దీంతో అతన్ని పింఛన్‌కు అనర్హుడిగా నిర్ధారించారు.
దివ్యాంగుడికి విద్యుత్‘షాక్’! తనకు సంబంధం లేని 16 విద్యుత్ మీటర్లు.. పింఛన్‌కు అనర్హుడిగా నిర్ధారణ! 📍 మండలం – తిమ్మరాజుపాలెం పుట్టుకతోనే 70% వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించిన దివ్యాంగుడు బి. మనోజ్ బాబు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాన్ని ఆశ్రయించాడు. అయితే అక్కడ పరిశీలనలో మనోజ్ బాబు ఆధార్‌కు శ్రీకాకుళం, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో ఏకంగా 16 విద్యుత్ కనెక్షన్లు నమోదై ఉన్నట్లు గుర్తించారు. తనకు తెలియని, తనకు ఎలాంటి సంబంధం లేని విద్యుత్ మీటర్లు తన ఆధార్‌కు ఎలా నమోదయ్యాయంటూ మనోజ్ బాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ⚠️ ఈ నమోదుల కారణంగా పింఛన్‌కు అనర్హుడిగా నిర్ధారించడంతో బాధితుడు అధికారులను ఆశ్రయిస్తున్నాడు. 👉 ఒక దివ్యాంగుడి ఆధార్‌పై మూడు జిల్లాల్లో 16 విద్యుత్ కనెక్షన్లు ఎలా నమోదయ్యాయి? 👉 ఇది సాంకేతిక తప్పిదమా? లేక ఆధార్ దుర్వినియోగమా? 👉 బాధ్యులెవరు? అధికారుల విచారణలో అసలు నిజం తేలాల్సి ఉంది.












