హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) జాతీయ కార్యవర్గ సమావేశం సంస్థ నేషనల్ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో సంస్థ వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాబోయే రోజుల్లో సంస్థ చేపట్టబోయే నూతన కమిటీల నియమకాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ట్రస్టీలు, నేషనల్ కార్యవర్గ సభ్యులు, మరియు నేషనల్ ఉమెన్ బాడీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సూచనలను అందించారు.
దేశవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న HRCI ని మరింత బలోపేతం చేసేందుకు, రాబోయే మూడు నెలల కాల వ్యవధిలోనే అన్ని జాతీయ కమిటీల నియమకాలను పూర్తి చేయాలని జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు.
రాబోయే కమిటీలలో మహిళలకు సముచిత స్థానం కల్పించడం మరియు సమాజంలో మహిళల హక్కుల రక్షణ కోసం ప్రత్యేక విభాగాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని తీర్మానించారు. అర్హత, నిబద్ధత మరియు సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న నాయకులను గుర్తించి వారికి జాతీయ కమిటీలలో కీలక బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
సమాజంలో ప్రతి ఒక్కరికీ మానవ హక్కుల పట్ల అవగాహన కల్పించడం, బాధితులకు అండగా నిలవడమే HRCI ముఖ్య ఉద్దేశమని డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి నూతన జాతీయ కమిటీల ఏర్పాటు అత్యవసరం అని, రాబోయే మూడు నెలల్లో ఈ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ నిర్ణయానికి సమావేశంలో పాల్గొన్న వారందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.











