హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) తెలంగాణ రాష్ట్ర శాఖ, ఏప్రిల్ 8న జరుపనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యాచరణ ప్రణాళికపై హైదరాబాద్లో సమావేశమైంది. ఈ సమావేశంలో వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
HRCI తెలంగాణ హెడ్ ఆఫీస్ అమృతం వీర స్టేట్ ఇంచార్జ్ గారి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ సమావేశంలో, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మరియు జనరల్ సెక్రెటరీలు హాజరయ్యారు.
మహిళా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంపై ఈ సందర్భంగా లోతుగా చర్చించారు. మహిళల హక్కులు, సాధికారతను ప్రోత్సహించేలా కార్యక్రమాలను రూపొందించాలని నిర్ణయించారు.
HRCI నేషనల్ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ అన్న గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. సంస్థ యొక్క ఆశయాలకు అనుగుణంగా వేడుకలు జరపాలని సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో అమృతం వీర, పి. నాగేశ్వరరావు, సిద్ది జ్యోతి, మమత, రాజు, సుధీర్, వంశీకృష్ణ, చేపల శివ, మరియు జగన్నాథం వంటి పలువురు HRCI నాయకులు పాల్గొన్నారు. రాబోయే దినోత్సవంపై వారి కార్యాచరణను ఖరారు చేసుకున్నారు.


