బాపట్ల, 2026-07-03
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం స్కూల్ బస్సులో మంటలు చెలరేగి పెను ప్రమాదం తప్పింది. నరసరావుపేట కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులో ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు దించాడు.
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం స్కూల్ బస్సులో పెను ప్రమాదం తప్పింది. నరసరావుపేటలోని కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు కర్లకుంట గ్రామానికి విద్యార్థులను తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, ఇంజిన్ భాగం నుంచి దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి, అందులోని విద్యార్థులను సురక్షితంగా బయటకు దించాడు. స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.












