పర్చూరు, 2026-06-05
పర్చూరు ప్రాంత రైతుల దశాబ్దాల సాగునీటి కల అయిన గుంటూరు ఛానల్ పొడిగింపు ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కనుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.274.53 కోట్లతో అనుమతులు మంజూరై, కాంట్రాక్టు ప్రక్రియ పూర్తయిన ఈ ప్రాజెక్టు, ప్రభుత్వం మారడంతో రివర్స్ టెండరింగ్ కారణంగా నిలిచిపోయింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక చొరవతో పనులు పునఃప్రారంభానికి చర్యలు వేగవంతమయ్యాయి.
పర్చూరు ప్రాంత రైతుల దశాబ్దాల సాగునీటి కల అయిన గుంటూరు ఛానల్ పొడిగింపు ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కనుంది. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.274.53 కోట్లతో పరిపాలనా, సాంకేతిక అనుమతులు మంజూరు కాగా, కాంట్రాక్టు ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే 2019లో ప్రభుత్వం మారడంతో రివర్స్ టెండరింగ్ కారణంగా పనులకు బ్రేక్ పడింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక చొరవతో ప్రాజెక్టు పునఃప్రారంభానికి చర్యలు వేగవంతమయ్యాయి.
టీడీపీ హయాంలో శ్రీకారం
201419 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గుంటూరు ఛానల్ పొడిగింపును ప్రాధాన్య అంశంగా తీసుకున్నారు. పర్చూరు, పెద్దనందిపాడు ప్రాంత రైతుల సాగునీటి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఏలూరి ప్రత్యేక చొరవతో ప్రాజెక్టుకు పరిపాలనా, సాంకేతిక అనుమతులు లభించడంతో పాటు కాంట్రాక్టు ప్రక్రియ కూడా పూర్తయింది. భూసేకరణకు సంబంధించిన సర్వేలు, ల్యాండ్ ప్లాన్ షెడ్యూళ్లను అధికారులు సిద్ధం చేశారు.
రివర్స్ టెండరింగ్‌తో జాప్యం
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ముందుకు వెళ్లిన టెండర్ల ప్రక్రియ రద్దయి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. అనంతరం రీటెండరింగ్, అంచనా వ్యయాల మార్పులు, నిధుల కొరత తదితర కారణాలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు. గర్నపూడిఅన్నంభట్లవారిపాలెం (తొండివాగు) వరకు పనులు చేపట్టే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు.
ఏలూరి ప్రయత్నాలతో మళ్లీ కదలిక
ప్రాజెక్టు నిలిచిపోయినా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రయత్నాలు కొనసాగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి గుంటూరు ఛానల్ పరిస్థితిని వివరించారు. పర్చూరు వరకు కాలువను పొడిగించడంతో పాటు భూసేకరణకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను కలిసి ప్రాజెక్టు పురోగతిపై ఏలూరి చర్చించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, 13(1) నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.
51 ఎకరాల భూసేకరణకు ముందడుగు
పర్చూరు మండలంలో ప్రాజెక్టుకు అవసరమైన సుమారు 51 ఎకరాల భూమిని సేకరించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. బాపట్ల ఆర్డీఓ ఖాతాలో భూసేకరణకు అవసరమైన నిధులు జమ చేసి ప్రక్రియను ప్రారంభించాలని ఎమ్మెల్యే ఏలూరి పట్టుబట్టారు. ప్రభుత్వం నిధుల విడుదలకు సానుకూలత వ్యక్తం చేయడంతో నిలిచిపోయిన భూసేకరణ ప్రక్రియకు మళ్లీ కదలిక వచ్చింది.












