బాపట్ల, 27 జూలై 2026
బాపట్ల రీజనల్ భూసార పరీక్ష కేంద్రం ఆధ్వర్యంలో వేటపాలెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు మట్టి నమూనాల సేకరణపై అవగాహన శిక్షణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్టి నమూనాలను శాస్త్రీయ పద్ధతిలో ఎలా సేకరించాలి, భూసార పరీక్షల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై విద్యార్థులకు వివరించారు.
బాపట్ల రీజనల్ భూసార పరీక్ష కేంద్రం ఆధ్వర్యంలో వేటపాలెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు మట్టి నమూనాల సేకరణపై అవగాహన శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మట్టి నమూనాలను శాస్త్రీయ పద్ధతిలో ఎలా సేకరించాలి, భూసార పరీక్షల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటనే అంశాలపై విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా వేటపాలెం మండల వ్యవసాయ అధికారి ఎం. సరిత మాట్లాడుతూ, ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని, వాటి ఫలితాల ఆధారంగా భూమికి అనువైన పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. భూసార పరీక్షల ద్వారా ఎరువుల వినియోగం తగ్గడంతో పాటు దిగుబడులు పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరోజిని, తరగతి ఉపాధ్యాయురాలు నీలిమ, డీఆర్సీ వ్యవసాయ అధికారి విజయరామరాజు, పాఠశాల ఉపాధ్యాయులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని మట్టి నమూనాల సేకరణ విధానంపై పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.












