బాపట్ల, 16 జూలై 2026
ప్రకాశంజిల్లాజాయింట్కలెక్టర్ జేసీ కల్పనాకుమారి,కౌలురైతులకుప్రభుత్వంఅందిస్తున్నపథకాలు,హక్కులుమరియుఅందుబాటులోఉన్నసౌకర్యాలపైవిస్తృతఅవగాహనకల్పించాలనిసూచించారు.దళితబహుజనరిసోర్స్సెంటర్(DBRC)రూపొందించినప్రచారకరపత్రాలనుఆమెఆవిష్కరించారు.
కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, హక్కులు మరియు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై విస్తృత అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (DBRC) వారు కౌలు రైతుల కోసం రూపొందించిన ప్రచార ఉద్యమ కరపత్రాలను జాయింట్ కలెక్టర్ తన ఛాంబర్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కల్పనా కుమారి మాట్లాడుతూ, కౌలు రైతులు తమ హక్కులను తెలుసుకొని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కౌలు రైతులకు పంట రుణాలు, పంటల బీమా, సాగు ధ్రువీకరణ పత్రాలు తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ వారు ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆమె అన్నారు.
కౌలు రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ శాఖ ద్వారా అందించే సేవలు మరియు సంబంధిత అధికారులను సంప్రదించే విధానాలను కరపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో కౌలు రైతులకు చేరువగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు, దర్శి ఏరియా కో-ఆర్డినేటర్ గుంటూరు నాగమణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి బిళ్ళ శరత్ తదితరులు పాల్గొన్నారు.












