ఏలూరు, ఆగస్టు 2
స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా, కలిదిండి మండల కేంద్రంలో మానవతా దృక్పథంతో కూడిన అద్భుతమైన కార్యక్రమం నిర్వహించబడింది. కలిదిండి గ్రామ పంచాయతీ పరిధిలోని స్థానిక హైస్కూల్‌కు చెందిన 1992-93 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అందరూ ఒకచోట చేరి అత్యంత ఉత్సాహంగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిత్రులందరూ కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా, కలిదిండి మండల కేంద్రంలో మానవతా దృక్పథంతో కూడిన అద్భుతమైన కార్యక్రమం నిర్వహించబడింది. కలిదిండి గ్రామ పంచాయతీ పరిధిలోని స్థానిక హైస్కూల్‌కు చెందిన 1992-93 పదవ తరగతి పూర్వ విద్యార్థులు అందరూ ఒకచోట చేరి అత్యంత ఉత్సాహంగా స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మిత్రులందరూ కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వారు ఒక అడుగు ముందుకు వేశారు. కలిదిండి పంచాయతీ పరిధిలో నిస్వార్థంగా సేవలందిస్తున్న పది మంది పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు గుడ్లు మరియు ఇతర నిత్యావసర సరుకులను అందజేసి తమ పెద్ద మనసును చాటుకున్నారు.
ప్రతి సంవత్సరం స్నేహితుల దినోత్సవం రోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ అలవాటు అని, అందుబాటులో ఉన్న స్నేహితులందరూ తప్పనిసరిగా కలసి ఈ సేవలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 1992-93 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పాము వీర వెంకట రవికుమార్, మోటుపల్లి సోమేశ్వరరావు, గోదావరి సుబ్రహ్మణ్యం, లలితా ప్రసాద్, ఆరోగ్య జీవరత్నం, జయరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్మికులకు సరుకులు అందజేసిన పూర్వ విద్యార్థుల బృందాన్ని స్థానికులు అభినందించారు.












