Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 26
చీరాల పట్టణంలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. డాక్టర్ పి.వి.ప్రసాద్ తన కుటుంబంతో కలిసి ప్రయాణించి, ఆటోలోనే మరిచిపోయిన బ్యాగ్‌ను గుర్తించి, పోలీసుల సహాయంతో యజమానికి క్షేమంగా అందజేశాడు. ఈ సంఘటన అందరి ప్రశంసలు అందుకుంది.
డాక్టర్ తన కుటుంబంతో కలిసి ఆటోలో ప్రయాణించి, అందులోనే మరిచిపోయిన బ్యాగ్‌ను యజమానికి క్షేమంగా అందజేసి ఓ ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకున్నాడు. చీరాల మండలం జాండ్రపేటకు చెందిన డాక్టర్ పి.వి.ప్రసాద్ తన కుటుంబంతో కలిసి, జాండ్రపేట హైస్కూల్ సమీపంలో ఆటో ఎక్కి, చీరాల పట్టణంలో దిగారు. అయితే, దిగిన తర్వాత తన బ్యాగ్‌ను ఆటోలోనే మరిచిపోయినట్లు గుర్తించారు.
బ్యాగ్‌లో బట్టలతో పాటు ఒరిజినల్ స్టడీ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఖరీదైన మనీ పర్స్‌తో పాటు ఇతర ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. బ్యాగ్ కనిపించకపోవడంతో డాక్టర్ పి.వి.ప్రసాద్ వెంటనే వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి, వివరాలను ఆటో యూనియన్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు.
ఈ పోస్టును గమనించిన చీరాల కొత్తపేటకు చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు, తన ఆటోను పరిశీలించగా బ్యాగ్ అందులోనే ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించాడు. పోలీసులు బ్యాగ్‌లోని వస్తువులను ధృవీకరించి, యజమానికి అందజేశారు.
విలువైన మనీ పర్స్, ఒరిజినల్ స్టడీ ధ్రువపత్రాలు ఉన్న బ్యాగ్‌ను నిజాయితీతో అప్పగించిన ఆటో డ్రైవర్ శ్రీ వెంకటేశ్వర్లుని ఒకటో పట్టణ సీఐ సోమశేఖర్, ఎస్సై రాజ్యలక్ష్మి, ఎస్సై వాణిశ్రీ అభినందించారు. డ్రైవర్ సేవాభావంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.










