బాపట్ల, 26 జూలై 2026
ఆధదేశథాథఎవహణైాషభతవీణయతీద.షతాయతీఎగీగఇతూడవాఎడవాాయతీఎవహాణయద.ా40జఈఎూతేేాణాళూొదతద.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ రెండో వారం నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, అక్టోబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు చేపట్టాలని నిర్ణయించింది.
సుమారు 40 రోజులలో విడతలవారీగా స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా, తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు చేపట్టాలని యోచిస్తున్నారు. చివరి విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.










