తిరుపతి, 23 September
తిరుపతి రూరల్ మండలం అవిలాలలోని ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో కస్టమర్ చేతివాటం ప్రదర్శించి సుమారు 60 గ్రాముల బంగారాన్ని అపహరించినట్లు సమాచారం. బ్యాంకు సిబ్బంది దృష్టి మరల్చి, కాగితాన్ని అడ్డుగా పెట్టి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది.
తిరుపతి రూరల్ మండలం అవిలాలలోని ఆంధ్ర గ్రామీణ బ్యాంకులో ఒక కస్టమర్ చేతివాటం ప్రదర్శించాడు. బ్యాంకు సిబ్బంది దృష్టి మరల్చి, ఒక కాగితాన్ని అడ్డుగా పెట్టి సుమారు 60 గ్రాముల బంగారాన్ని అపహరించినట్లు సమాచారం. సిబ్బందికి అనుమానం రావడంతో పరిశీలించగా బంగారం కనిపించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించగా, వారు కేసు నమోదు చేసి నిందితుడి కోసం దర్యాప్తు చేపట్టారు.












