చీరాల, 2026-08-27
బాట్ల జల్లా, చీరాల మండలం, బుర్లవారాలెం గ్రామ ంచాయతీ రధలోన ఏీ మోడల్ స్కూల్లో పై వద్యార్థులకు ోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నర్వహంచారు. ఈ సందర్భంగా చీరాల టూ టౌన్ సీఐ ఏ. శశకుమార్ మాట్లాడుతూ, వద్యార్థులు సబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, సోషల్ మీడయా దుష్్రభావాలకు దూరంగా ఉండాలన సూచంచారు.
బాపట్ల జిల్లా, చీరాల మండలం, బుర్లవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల టూ టౌన్ సీఐ ఏ. శశికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీఐ ఏ. శశికుమార్‌తో పాటు ఎస్సై కె.పి. రవీందర్, చీరాల సబ్‌డివిజన్ శక్తి టీం సభ్యురాలు సిహెచ్. సునీత, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎన్. ఆంజనేయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీఐ శశికుమార్ సూచించారు. సోషల్ మీడియాను బాధ్యతారహితంగా వినియోగించడం వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించి, అనవసరంగా దాని వాడకానికి దూరంగా ఉండాలని కోరారు. అలాగే గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు విద్యార్థులు పూర్తిగా దూరంగా ఉండాలని, మంచి నడవడిక, క్రమశిక్షణతో విద్యాభ్యాసంపై దృష్టి సారించాలని సూచించారు.
మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, మైనర్ డ్రైవింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు, జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించాలని కోరారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ మంచి విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తనతో ముందుకు సాగాలని పోలీసు అధికారులు విద్యార్థులకు సూచించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివిధ రకాల నేరాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని వివరించారు.
ఈ అవగాహన సదస్సు నిర్వహించిన చీరాల టూ టౌన్ పోలీసు అధికారులకు, సిబ్బందికి ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎన్. ఆంజనేయులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బందికి చీరాల టౌన్ పోలీసుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.









