చీరాల పట్టణంలో ఆదివారం జరగనున్న నీట్ (NEET) ప్రవేశ పరీక్షల నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసింది. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడడానికి డి.ఎస్.పి ఎండి. మోయిన్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు డి.ఎస్.పి తెలిపారు. కేంద్రాల పరిసరాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
విద్యార్థులు నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయానికంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడవని స్పష్టం చేశారు.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ షాపులు మూసి ఉంచబడతాయని అధికారులు తెలిపారు. పరీక్షలు సజావుగా సాగడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.









