హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం విద్యా నిధి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం మంగళవారం HRCI జాతీయ కార్యాలయంలో జరిగింది.
HRCI జాతీయ చైర్మన్ మరియు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, అర్హులైన విద్యార్థులకు సౌత్ ఇండియా ఉమెన్ పోర్ట్ ప్రెసిడెంట్ కోన వరలక్ష్మి, సౌత్ ఇండియా జనరల్ సెక్రెటరీ పొట్లూరి సత్యవతి చేతుల మీదుగా ఫీజులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాణ్యమైన విద్యను అభ్యసించలేని ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలవడం. దీని ద్వారా విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందుతుంది.
ఈ కార్యక్రమంలో HRCI జాతీయ జనరల్ సెక్రెటరీ ముత్యాల బాబు, కృష్ణా జిల్లా సభ్యులు మరియు పలువురు పాల్గొన్నారు. ఈ విద్యా నిధి కార్యక్రమం భవిష్యత్తులో మరిన్ని విద్యా కార్యక్రమాలకు మార్గం సుగమం చేస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.










