బాపట్ల, August 1, 2026
బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ పరిధిలోని పేరాల ఒంగోలు పాకలు ప్రత్యేక పురపాలక ప్రాథమిక పాఠశాలలో శనివారం నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆనందభరిత అభ్యాసం, పాఠశాల పట్ల ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంఈవో-1 టి. రామాదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ పరిధిలోని పేరాల ఒంగోలు పాకలు ప్రత్యేక పురపాలక ప్రాథమిక పాఠశాలలో శనివారం నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో-1 టి. రామాదేవి పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆనందభరిత అభ్యాసం, పాఠశాల పట్ల ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు పుస్తకాల సంచులు లేకుండా పాఠశాలకు హాజరై ఆటల ద్వారా నేర్చుకునే కార్యక్రమాలు, చిత్రలేఖనం, కథల వినిపించడం, పాటలు, సమూహ కార్యకలాపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వినోదాత్మక క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠ్యాంశాలను ఒత్తిడి లేకుండా ఆనందంగా నేర్చుకునేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఎంఇఓ 1 రమాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. సుబ్బారావు మాట్లాడుతూ, నో బ్యాగ్ డే కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సహకార భావన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యను ఆనందదాయకంగా మార్చే ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర వికాసానికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఎంఈవో-1 టి. రామాదేవి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి. లలిత ప్రియ, బి. నరసింహ నాయక్, ఎం. జ్యోతిర్మయి, బి. నాగరాజు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతమైంది.










