బాపట్ల, 28 జూలై 2026
సథఏ.బ.ఎం.జళశోంళవంపఖవ,సంఘసవఘవణససఫపసపంపణంజం.ఈంోవశఖపటంజఘవణఎం.ృషణంజఖఅథపొ,వథ.20,000/-పోషఅంజశ.
స్థానిక ఏ.బి.ఎం. జూనియర్ కళాశాలలో మంగళవారం ప్రముఖ న్యాయవాది, సంఘసేవకురాలు రాఘవ రాణి స్మారక స్ఫూర్తి పురస్కారాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లా న్యాయమూర్తి రాఘవ రాణి కుమారుడు, సంస్థ నిర్వాహకుడు ఎం. రామకృష్ణం రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు అకుంఠిత దీక్షతో, పట్టుదలతో విద్యను అభ్యసిస్తే తప్పనిసరిగా లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా తల్లితండ్రుల ఇష్టాలను గుర్తించాలని సూచించారు. తన తల్లి జ్ఞాపకార్థం కళాశాల విద్యార్థినులకు రూ. 20,000/- పారితోషికాన్ని అందజేశారు.
కార్యక్రమానికి కళాశాల ఏవో పుల్లగూర జయశీల రావు అధ్యక్షత వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణి, రిటైర్ట్ ఆర్డీవో పేరయ్య, ఓపిడిఆర్. రాష్ట్ర కార్యదర్శి సిహెచ్. సుధాకర్, జవహర్ భారతి కాలేజ్ కావలి రిటైర్ట్ ప్రిన్సిపాల్ ఎం.ఎన్. రవికుమార్, జొనాతన్ నవరత్నకుమారి, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
పి.భావ సంహిత : రూ. 5000, ఐ.అనూష : రూ.5,000, యు.వి.సరస్వతి : రూ. 2,500, కె.హన్నా : రూ.2,500, కె.ప్రభాసి : రూ.2,500, ఎం.వి.శిరీష : రూ.2,500.











