** (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 24
కలిదిండి మండలం మట్టగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'మెగా పేరెంట్స్ డే 4.0' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాస రావు, విద్యార్థుల ఉజ్జ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని అన్నారు.
విద్యార్థుల ఉజ్జ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాస రావు పేర్కొన్నారు. కలిదిండి మండలం మట్టగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'మెగా పేరెంట్స్ డే 4.0' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తోందని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ పిల్లల విద్యాభ్యాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు దాతలందరూ సమష్టిగా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిసి వైస్ చైర్మన్ నాగిడి వీర బ్రహ్మం, పిఎసిఎస్ అధ్యక్షులు బళ్ళా రాజు, తిరుమాని గోపాలకృష్ణ, మోకా నరసింహ స్వామి, తిరుమల శెట్టి ఈశ్వర పరశురాముడు, వాతాడి రాంబాబు, కొపనాతి బంగార్రాజు, కొల్లాటి సత్యనారాయణ, విద్యా కమిటీ చైర్మన్ కోపనాతి రాము, పాఠశాల ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.










