బాపట్ల, 2026-07-24
బాపట్ల జిల్లా చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ (Mega PTM 4.0) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులు హాజరై విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
బాపట్ల జిల్లా చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ (Mega PTM 4.0) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో కార్యాలయ ఏఎస్ఓ వెంకటస్వామి, యెరిచర్ల డాని, వార్డు కౌన్సిలర్ మల్లెల లలిత, రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని వారు సూచించారు. కళాశాల కరస్పాండెంట్ శీలం విద్యాసాగర్, ప్రిన్సిపాల్ గారపాటి పుష్పరాజు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తల్లిదండ్రులకు విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, పరీక్షల ఫలితాలు, ఉన్నత విద్య అవకాశాలపై అధ్యాపకులు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










