అమరావతి, 2026-06-05
తెలుగు భాష పరిరక్షణ, ప్రోత్సాహంపై శాసనసభలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ విద్యలో తెలుగును తప్పనిసరి చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.

మంత్రి లోకేష్ సానుకూల స్పందన
ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన సూచనలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ కమిటీలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు.
మాతృభాష పరిరక్షణ బాధ్యత
మాతృభాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలుగు భాషకు ప్రాధాన్యత పెంచేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.