చీరాల, 2026-06-05
కయూమనరౌనయూమన హయూమన రైట్స్ రెడయూమన కయూమనరాసయూమన కారయూమనయాలయంలౌనయూమన ఆగస్ట్దీవారం రెడయూమన కయూమనరాసయూమన ఆగస్ట్ధయూమనవరయూమనయంలౌనయూమన, గయూమనంటూరయూమన రమేషయూమన హాసయూమనపటలయూమన సహకారంతౌనయూమన ఉచీత వైదయూమనయ శీబీరలం వీజయవంతంగా నీరలయూమనవహీంచారయూమన. ఈ శీబీరలంలౌనయూమన 125 మందీకీ గయూమనండె సంబంధీత పరీకయూమనషలయూమన, ఈకయూమనరౌనయూమనజీ, ఎకౌనయూమన, రకయూమనత పరీకయూమనషలయూమన ఉచీతంగా అందీంచారయూమన.
క్రౌన్ హ్యూమన్ రైట్స్ చీరాల 2 ఆగస్ట్ 2026 : చీరాల రెడ్ క్రాస్ కార్యాలయంలో ఆదివారం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో, గుంటూరు రమేష్ హాస్పటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రెడ్ క్రాస్ ప్రెసిడెంట్, తహసిల్దార్ గోపికృష్ణ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని, ఇలాంటి శిబిరాలు పేదల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని ఆయన సూచించారు.
వైద్య పరీక్షలు
గుంటూరు రమేష్ హాస్పటల్ నుంచి వచ్చిన గుండె వైద్య నిపుణులు డాక్టర్ నల్లమోతు కిరీటి రతన్, జనరల్ మెడిసిన్ ఎండి డాక్టర్ సందీప్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో మొత్తం 125 మందికి గుండె వైద్య పరీక్షలు, ఈసీజీ, ఎకో, రక్త పరీక్షలు ఉచితంగా చేసినట్లు రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశికిరణ్ తెలిపారు.
భవిష్యత్ ప్రణాళికలు
ప్రతినెలా ఇలాంటి వైద్య సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు రెడ్ క్రాస్ చైర్మన్ బూదరాజు శశికిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ సూరంపల్లి తేజస్వి, సెక్రెటరీ జిఏవి ప్రసాద్, ఎంసీ నెంబర్లు పసుపుల వందనం, ఫిరోజ్, త్రోవగుంట అబ్దుల్, తడవర్తి చంద్రశేఖర్, దమ్ము విజయభాస్కర్, పల్లపోతు విశ్వనాథం, కార్యవర్గ సభ్యులు ఎస్. పవన్ కుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.












