స్వర్ణ భవిత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల సమగ్ర ప్రొఫైల్ను సిద్ధం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో స్వర్ణ భవిత పాఠశాల అమలు తీరుపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు స్వర్ణ భవిత పాఠశాల ద్వారా మెరుగైన భవిష్యత్తును అందించాలని కలెక్టర్ అన్నారు. పాఠశాలను ఆధునికీకరించి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పాఠశాలకు వచ్చే ప్రతి చిన్నారి పుట్టినప్పటి నుంచి ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితి, అందించిన వైద్య సేవలు తదితర వివరాలతో సమగ్ర ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు.
స్వర్ణ భవిత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ అధికారులను ఆదేశించారు. నవచేతన్ యాప్ అమలుతో పాటు వైద్య ఆరోగ్యశాఖ సేవలను పాఠశాలకు అనుసంధానం సూచించారు. చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులు సమగ్ర నివేదిక అందజేయాలని కోరారు. అలాగే, స్వర్ణ బాపట్ల యాప్లో స్వర్ణ భవిత పాఠశాలకు సంబంధించిన వివరాలను నమోదు సూచించారు.
పాఠశాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.









