బాపట్ల, 2026-11-28
పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. అమృతలూరు మండలం, మూల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అన్ని సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు.
రెండవ సాధారణ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా, ఆదివారం 29న జరగనున్న ఎన్నికల నిర్వహణకు సంబంధించి, శనివారం అమృతలూరు మండలం, మూల్పూరు గ్రామంలోని మండల ప్రాథమిక పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 14 పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా, రెండవ సాధారణ స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అమృతలూరు మండల పరిధిలోని మూల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన 14 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ఫర్నిచర్, ర్యాంపులు వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఓటర్లతో కలెక్టర్
ఆనంతరం, మూల్పూరు గ్రామం మండల ప్రజా పరిషత్, పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా, అక్కడ ఉన్న ఓటర్లతో కలెక్టర్ మాట్లాడుతూ, మీ పేరు ఓటర్ జాబితాలో ఉందా చూసుకున్నారా ఓటర్ స్లిప్స్ ఇచ్చారా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీరందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని సూచించారు.
జిల్లా కలెక్టర్ వెంట రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారిణి బి.శ్రీదేవి, తహశీల్దార్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలు తదితరులు ఉన్నారు.



