క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-20
ఆదోనిలోని భాష్యం స్కూల్-2లో బాలల దినోత్సవాన్ని భాష్యం చైర్మన్ రామకృష్ణ, జె డి ఓ మాచాని కవిత మేడం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న నాయకర్, మల్లప్ప నాయకర్ మాట్లాడుతూ, పిల్లలే రేపటి భారతదేశ భవిష్యత్తు అని అన్నారు. ప్రతి చిన్నారి నవ్వులో ఆనందం, ప్రతి కలలో ఒక కొత్త ప్రపంచం దాగి ఉంటుందని, పిల్లలలోని ప్రతిభను వెలికితీసి, వారి కలలను నిజం చేసుకునేలా ప్రోత్సహించడమే బాలల దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.
భాష్యం ప్రిన్సిపల్ జాఫర్ గారు మాట్లాడుతూ, పిల్లల ఆనందం, అల్లరి, ఆటపాటలు, నవ్వులతో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. చదువుతో పాటు ఆటలు, సృజనాత్మకత, మంచి విలువలను అలవర్చుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.
భాష్యం వన్ బ్రాంచ్ సురేంద్రబాబు గారు పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అంజి, హెచ్ఎం రేవతి, ఆదోని వన్ హెచ్ఎం శిరీషతో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొంది.
భాష్యం స్కూల్ - ఆదోని 2 ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మీ కలలే రేపటి విజయానికి పునాది అని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు.







