వెళ్లొద్దు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 23
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల భద్రతకు బాపట్ల జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం బీచ్‌లతో పాటు ఇతర తీర ప్రాంతాల్లో సుమారు 430 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చే భక్తుల భద్రతకు బాపట్ల జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. జిల్లాలోని ప్రధాన సముద్ర తీర ప్రాంతాలైన సూర్యలంక, వాడరేవు, రామాపురం బీచ్‌లతో పాటు ఇతర ప్రాంతాల్లో సుమారు 430 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సూర్యలంక బీచ్ వద్ద బాపట్ల డీఎస్పీ సీహెచ్. చంద్రమౌళి ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, తొమ్మిది మంది ఎస్ఐలతో కలిపి 260 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. వాడరేవు, రామాపురం బీచ్‌లతో పాటు పొట్టి సుబ్బయ్యపాలెం, మోటుపల్లి ప్రాంతాల్లో చీరాల డీఎస్పీ ఎం.డి. మోయిన్ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 12 మంది ఎస్ఐలతో కలిపి 166 మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. దేవాలయాలు, నదీ తీర ప్రాంతాల్లోనూ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాల సమయంలో ప్రమాదాలు జరగకుండా లైఫ్ జాకెట్లు, రోప్‌లతో సివిల్, మెరైన్ పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఎర్రజెండాలు ఏర్పాటు చేసి, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. సముద్రంలో పడవల ద్వారా గస్తీ నిర్వహిస్తున్నారు. భక్తులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారిని ఒంటరిగా నీటిలోకి వెళ్లనివ్వకూడదని ఎస్పీ సూచించారు. పోలీసుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా, నిర్దేశించిన పరిమితి దాటి సముద్రంలోకి వెళ్లకూడదని స్పష్టం చేశారు. ప్రజల రక్షణ, భద్రత కోసమే పోలీస్ శాఖ సూచనలు జారీ చేస్తోందని, వాటిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112 టోల్ ఫ్రీ నంబర్ లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8333813228 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. భక్తులందరూ అప్రమత్తంగా ఉండి సురక్షితంగా పుణ్యస్నానాలు ఆచరించి క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.







