రెడ్డిగూడెం, 2026-11-24
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, అల్లర్లు చోటుచేసుకోకుండా మండల పరిధిలో మొత్తం 108 మందిని బైండోవర్ చేసినట్లు మండల ఎస్సై శ్రీను తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో స్థానిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టిందని రెడ్డిగూడెం మండల ఎస్సై శ్రీను తెలిపారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, అల్లర్లు చోటుచేసుకోకుండా మండల పరిధిలో మొత్తం 108 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా ముచ్చనపల్లి గ్రామంలో సుమారు 30 మందిపై బైండోవర్ చర్యలు తీసుకున్నట్లు ఎస్సై శ్రీను తెలిపారు.
ఎన్నికల సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా తోడ్పడాలని ఎస్సై కోరారు.







