వినుకొండ, 2026-11-22
వినుకొండ గ్రామీణ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
వినుకొండ గ్రామీణ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. వినుకొండ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ 11వ వార్డు అభ్యర్థిగా సీపీఐ బలపరిచిన పోట్లూరు అంజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వినుకొండ సీపీఐ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, బ్రాహ్మణపల్లి 11వ వార్డులో పోట్లూరు అంజమ్మ ఏకగ్రీవ ఎన్నిక కావడం సీపీఐకి సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఆమెపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి సహకరించిన బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజలకు, పెద్దలకు, యువతకు, పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు చూపిన ఆదరణ, నమ్మకం తమపై మరింత బాధ్యతను పెంచాయని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 11వ వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి పోట్లూరు అంజమ్మ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వినుకొండ రూరల్ పరిధిలో సీపీఐకి ఇది తొలి విజయం కావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని బూదాల శ్రీనివాసరావు తెలిపారు. గ్రామస్థుల మద్దతు, పార్టీ కార్యకర్తల కృషి ఈ విజయానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, ప్రజలకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏకగ్రీవ ఎన్నికతో వినుకొండ గ్రామీణ ప్రాంతంలో సీపీఐ తన ఉనికిని చాటుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ వినుకొండ మండల కార్యదర్శి కొప్పరపు మల్లిఖార్జున, బూదాల మనోహర్, దారివేముల మరియబాబు, సలోమి, మిరియంపల్లి శ్రీను, టంగుటూరి వెంకట్రావు, టంగుటూరి బ్రహ్మయ్య, జల్లి వెంకటేశ్వర్లు, బిజ్జం వేణుగోపాలరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.







