క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-23
నెల్లూరు నగరపాలక సంస్థ 21వ డివిజన్ కార్పొరేటర్‌గా జనసేన వీర మహిళ విజయలక్ష్మి గునుకుల ప్రమాణ స్వీకారం చేశారు.
నేను గునుకుల విజయలక్ష్మి, 21వ డివిజన్ కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ భావోద్వేగ క్షణం, సామాన్య మహిళకు జనసేన కల్పించిన గౌరవం, ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. పవనన్న ఆశయాలతో ప్రజాసేవే పరమావధిగా నా ప్రయాణం ప్రారంభమైంది. జనసేన వీర మహిళగా, సామాన్యుడికి రాజకీయ అవకాశం కల్పిస్తూ, ప్రజాసేవే లక్ష్యంగా నా తొలి అడుగు పడింది. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ రూప్ కుమార్ సమక్షంలో, 21వ డివిజన్ కార్పొరేటర్‌గా జనసేన వీర మహిళ శ్రీమతి విజయలక్ష్మి గునుకుల ప్రమాణ స్వీకారం చేయడం మా కుటుంబానికే కాకుండా, మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ఎంతో భావోద్వేగమైన, గర్వకారణమైన క్షణం.
ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ప్రజాప్రతినిధిగా ఎదిగే అవకాశాన్ని కల్పించిన జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ అండగా నిలిచి, ప్రోత్సహిస్తూ, మార్గనిర్దేశం చేసిన గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు. నిరంతరం మాకు స్ఫూర్తినిచ్చే మా పొంగూరి రమాదేవి ఆశీస్సులతో... అలాగే మాపై నమ్మకం ఉంచి, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించి, ఆశీర్వదించి, ఈ స్థాయికి చేరుకోవడానికి తోడ్పడిన ప్రతి జనసేన నాయకుడికి, కార్యకర్తకు, వీర మహిళకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా 21వ డివిజన్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఇది పదవి కాదు, ప్రజలు మాకిచ్చిన బాధ్యత ఇది కేవలం విజయం మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం పారదర్శకమైన పాలన, రాజకీయ జవాబుదారీతనం, ప్రజాస్వామ్య విలువలే ప్రాతిపదికగా ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం. 21వ డివిజన్ ప్రజలకు తెలియజేసేది ఒక్కటే: మీ సమస్య ఏదైనా, మీ అవసరం ఏదైనా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మా దృష్టికి తీసుకురావచ్చు. ప్రతి సమస్యను మా సమస్యగా భావించి, పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తాం. ప్రజలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటాం.
అధికారం కోసం కాదు ప్రజల కోసం పదవి కోసం కాదు ప్రజాసేవ కోసం రాజకీయాలు అంటే హోదా కాదు, జవాబుదారీతనం అని నిరూపించే దిశగా మా ప్రయాణం కొనసాగుతుంది.







