పోరుమామిళ్ళ, 14 November
కడప జిల్లా మండలం టేకురుపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కేవలం 22 ఏళ్ల యువకురాలు నగిరి శివసాహితి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చిన్న వయసులోనే ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో వస్తున్న ఆమెకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది.
రాష్ట్ర రాజకీయాల్లో యువతరం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనుంది. కడప జిల్లా మండలం టేకురుపేట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కేవలం 22 ఏళ్ల యువకురాలు నగిరి శివసాహితి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చిన్న వయసులోనే ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో వస్తున్న ఆమెకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. శివసాహితి తండ్రి భైరవ ప్రసాద్ ప్రస్తుతం టీడీపీ మండల అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ, ఉన్నత చదువులతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై అవగాహన ఉన్న శివసాహితి పోటీ చేయడం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సోమవారం స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలతో కలిసి ఆమె తన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్న తరుణంలో, 22 ఏళ్ల యువతి సర్పంచ్ పదవికి పోటీ పడటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యువత ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి రావాలని పార్టీలు ఆహ్వానిస్తున్న తరుణంలో, ముందుకు రావడం హర్షించదగిన విషయమని మేధావులు అభిప్రాయపడ్డారు.






