కారంచేడు, 14 November
కారంచేడు మండలం కొడవలివారిపాలెం జెడ్పిహెచ్ హైస్కూల్లో బాలల దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు.
పిల్లలే దేశ భవిష్యత్తు అని, వారి విద్యా, ఆరోగ్యం, ఆనందం, సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






