మరియు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 18
గుంటూరు - కృష్ణా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరుగా నమోదు చేసుకోవడానికి డిసెంబరు 23 నుండి మరో అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఇ.ఆర్.ఓ) మరియు జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి తెలిపారు. న తుది ఓటరు జాబితా విడుదల చేయబడుతుంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరుగా నమోదు చేసుకోవడానికి డిసెంబరు 23 నుండి మరో అవకాశం ఉంటుందని గుంటూరు - కృష్ణా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఇ.ఆర్.ఓ) మరియు జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎన్నికలపై జరిగిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పూర్వ గుంటూరు, కృష్ణా జిల్లాలలో పనిచేస్తున్న ఉన్నత పాఠశాల మరియు ఆపై స్థాయిలో బోధనలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని ఆయన తెలిపారు. భారత ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు స్థానికంగా నివాసం ఉంటున్నప్పుడు మాత్రమే ఓటరుగా అర్హులుగా పరిగణించబడతారని ఆయన స్పష్టం చేశారు. 2026 నవంబరు 1వ తేదీ నాటికి, కనీసం ఆరు సంవత్సరాల పాటు వృత్తిలో కొనసాగుతూ, అందులో కనీసం మూడు సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల, ఆపై స్థాయిలో బోధన అనుభవం కలిగి ఉండాలని ఆయన తెలిపారు.
ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు అర్హత కలిగి ఉంటారని, వారి అర్హతను జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐఓ), కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ నిర్ధారించాలని ఆయన వివరించారు. ఓటరుగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని లేదా ఫారం 19 పూర్తి చేసి, ఏ.ఈ.ఆర్.వోలు అందుబాటులో ఉన్న స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లకు సమర్పించవచ్చని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 15 వేల దరఖాస్తులు అందాయని, మొత్తం 19 వేల మంది అర్హులైన ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు అంచనా ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కె.కె.గుప్తా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కంచర్ల శివరామయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డా.టి.సేవ కుమార్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి చిరతన గండ్ల వాసు, సీపీఐ (ఎం) ప్రతినిధి కృష్ణకాంత్, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి వై. పిచ్చి రెడ్డి, జనసేన పార్టీ ప్రతినిధి త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.







