హైదరాబాద్, 26 September
హైదరాబాద్‌లో ఒక 27 ఏళ్ల యువ న్యాయవాది డేటింగ్ యాప్ ద్వారా సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.4.91 కోట్లు నష్టపోయాడు. ప్రైవేట్ చాట్స్, వీడియో కాల్స్ బయటపెడతామని బెదిరించడంతో బాధితుడు భారీ మొత్తంలో డబ్బు చెల్లించాడు.
హైదరాబాద్‌లో 27 ఏళ్ల న్యాయవాది డేటింగ్ యాప్ మాయలో చిక్కుకుని ఏకంగా రూ.4.91 కోట్లు నష్టపోయాడు. యాప్ ద్వారా పరిచయమైన సైబర్ నేరగాళ్లు ప్రైవేట్ చాట్స్, వీడియో కాల్స్‌లోని సున్నితమైన సమాచారాన్ని బయటపెడతామని బెదిరించినట్లు సమాచారం.
బ్లాక్‌మెయిల్‌కు భయపడిన బాధితుడు 241 లావాదేవీల్లో రూ.4.91 కోట్లు నిందితుల ఖాతాలకు బదిలీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బు ఖాళీ అయిన తర్వాత సొంత ఫ్లాట్‌ను సైతం విక్రయించి వచ్చిన మొత్తాన్ని కూడా నేరగాళ్లకు చెల్లించినట్లు వెల్లడించాడు.
ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలు పంచుకోవద్దని.. బ్లాక్‌మెయిల్‌కు గురైతే డబ్బులు చెల్లించకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని హెచ్చరించారు.












