మంగళగిరి గ్రామీణం, 2026-11-29
గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ వ కుల్ జిందాల్ ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు, ఈగల్ టీం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో 72 కేజీల గంజాయి, రెండు కార్లను స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ వ కుల్ జిందాల్ ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు, ఈగల్ టీం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో 72 కేజీల గంజాయి, రెండు కార్లను స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
కేసు వివరాలను మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి కె వెంకటేశ్వర్లు, సీఐ వెంకట్ వెల్లడించారు. ఒడిశా నుంచి బెంగళూరుకు ఆంధ్రప్రదేశ్ మీదుగా వస్తున్న రెండు కార్లను ఖాజా టోల్ ప్లాజా వద్ద తనిఖీ కోసం ఆపగా, అవి ఆగకుండా వెళ్లిపోయాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ కార్లను వెంబడించి, చిన్న కాకాని హైలాండ్ వెనుక రైతుల సహాయంతో వాటిని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో నిందితులు పోలీసులపై తిరగబడ్డారు. దర్యాప్తులో నిందితులు కేజీ గంజాయిని రూ.7,000కు కొనుగోలు చేసి, బయట మార్కెట్లో రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు అమ్ముతున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని డిఎస్పి కె వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ దాడుల్లో సీఐ వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు.







