క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-24
ఆదోని మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన 30 మంది కౌన్సిలర్లకు పార్టీ విప్ జారీ చేసింది. రేపు జరగనున్న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పార్టీ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఆదోని మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన 30 మంది కౌన్సిలర్లకు పార్టీ విప్ జారీ చేసింది. రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సూచనల మేరకు భూపాల్ చౌదరి ఈ విప్ జారీ చేశారు.
రేపు ఆదోని పట్టణంలో జరగనున్న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పార్టీ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఈ విప్ ద్వారా సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టి. మణి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, పట్టణంలోని టీడీపీ తరఫున ఎన్నికైన 30 మంది కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







