చేసిన (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 15
శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదివారం త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి, విస్తృతంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ, రికార్డులు, ఆయుధాలు, వాహనాలను పరిశీలించారు.
శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదివారం త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించి, విస్తృతంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఎస్పీ తొలుత స్టేషన్ ఆవరణ, పరిసరాల పరిశుభ్రత, లాకప్ గదులు, స్టేషన్లో భద్రపరిచిన వివిధ రకాల ఆయుధాలు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్లోని వివిధ కీలక రికార్డులు, క్రైమ్ రిజిస్టర్లు, పెండింగ్ కేసుల స్థితిగతులు, దర్యాప్తు పురోగతి, ఫిర్యాదుల స్వీకరణ రిజిస్టర్లను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా సమావేశమై వారి పనితీరును సమీక్షించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గస్తీ (పెట్రోలింగ్) వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా ప్రతి ఒక్కరూ పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





