లిబరేషన్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 16
విద్యార్థులు సమస్యల నుంచి దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ వరకు ప్రతి పోరాటంలో భాగస్వాములు కావాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ () జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రసంజిత్ కుమార్ పిలుపునిచ్చారు.
విద్యార్థులు సమస్యల నుంచి దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ వరకు ప్రతి పోరాటంలో భాగస్వాములు కావాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ () జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రసంజిత్ కుమార్ పిలుపునిచ్చారు.
అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రెండవ రాష్ట్ర మహాసభలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రసంజిత్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో విద్యారంగ ప్రైవేటీకరణ, కాషాయీకరణ, కేంద్రీకరణ వేగంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్య వాతావరణం దెబ్బతింటోందని, విద్యార్థుల ప్రశ్నించే హక్కును, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ విద్యారంగం, రైతులు, కార్మికుల హక్కులు, అట్టడుగు వర్గాల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన అన్నారు. మతపరమైన విభజనను పెంచుతూ, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయ క్యాంపస్లను విద్యార్థుల స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య హక్కులకు వ్యతిరేకమైన కేంద్రాలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
మొదటి నుంచీ లడో పడాయీ కరనే కో, పఢో సమాజ్ బదల్నే కో (చదువు కోసం పోరాడండి, సమాజాన్ని మార్చడానికి చదవండి) అనే నినాదంతో విద్యార్థి వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తోందని ఆయన తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 23 రోజుల పాటు నిర్వహించిన ఆందోళనను ఆయన గుర్తుచేశారు. ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తూ జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా బోరా పోరాటం కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు.
ఓటర్ల జాబితా సవరణపై విమర్శలు
ఈ మహాసభలకు పరిశీలకురాలిగా హాజరైన జాతీయ ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ లేఖ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ () పేరుతో బీజేపీ అనేక అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ ప్రక్రియను దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తూ ప్రజల ఓటు హక్కుకు ముప్పు కలిగిస్తున్నారని అన్నారు. మహిళా నాయకత్వం, మహిళా కార్యకర్తల భాగస్వామ్యం ఉద్యమాలకు ఎంతో అవసరమని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ(యమ్ యల్) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఉదయ్ కిరణ్ మహాసభలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ను మరింత విస్తరించి, విద్యార్థుల సమస్యలపై బలమైన ఉద్యమాలను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.






