గుడ్లవల్లేరు, 18 November
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో గుడ్లవల్లేరులోని శేషాద్రి రావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన సెంట్రల్ జోన్ మహిళల కబడ్డీ పోటీల్లో చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థినులు ప్రతిభ కనబరిచి రన్నరప్‌గా నిలిచారు. ఈ విజయంతో కళాశాలకు మంచి గుర్తింపు లభించింది. ఈ పోటీల్లో మొత్తం 30 కళాశాలలకు చెందిన జట్లు పాల్గొనగా, సెయింట్ ఆన్స్ కళాశాల మహిళల కబడ్డీ జట్టు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ పోటీలో గుంటూరుకు చెందిన సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల జట్టుతో తలపడి రన్నరప్‌గా నిలిచింది. ఈ జట్టులో వి. మానస, బి. ప్రవల్లిక, కె. పూజిత, టి. శ్రీవిద్య, ఐ. వసుధ, కె. అనిత, ఎం. శ్రావణి, ఎం. సోనాలి, సి. సంజన, వై. భూమిక, టి. భార్గవి, ఎల్. భావన పాల్గొని ప్రతిభ కనబరిచారు.
కబడ్డీ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన బి. ప్రవల్లిక, వి. మానసలను త్వరలో జరగనున్న ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీల్లో జేఎన్టీయూ కాకినాడ తరఫున ప్రాతినిధ్యం వహించే జట్టుకు ఎంపిక చేసినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్. లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. జగదీష్ బాబు, కళాశాల మేనేజర్ ఆర్.వి. రమణమూర్తి, డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) వనమా దొర నాగ సాయినాధ్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విజేత విద్యార్థినులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.







