త్రిపురాంతకం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 18
మార్కాపురం జిల్లా మండలంలోని స్థానిక శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 43 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లా మండలంలోని స్థానిక శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, బుధవారం ఐదవ రోజున గ్రంథపాలకులు జి.రామాంజి నాయక్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా వివిధ అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అడిగి, విద్యార్థుల విజ్ఞాన ప్రతిభను పరీక్షించారు. మొత్తం 43 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ మేధోసామర్థ్యాన్ని ప్రదర్శించారు. విద్యార్థుల్లో సాధారణ విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు పుస్తక పఠనంపై ఆసక్తిని కలిగించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు, గ్రంథపాలకులు జి.రామాంజి నాయక్ మరియు తెలుగు ఉపాధ్యాయులు సి.హెచ్. ఏడుకొండలు తెలిపారు.







