బాపట్ల, 2026-11-23
చీరాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ, చీరాల పురపాలక చరిత్రలో తెలుగుదేశం పార్టీకి దక్కిన విజయం ప్రజల విజయమని అన్నారు.
చీరాల రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని, చీరాల పురపాలక ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీకి దక్కిన చారిత్రాత్మక విజయం ప్రజల విజయమని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పేర్కొన్నారు. సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషికి ప్రజలు మద్దతుగా నిలిచారని తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మద్దతుతో హనీ స్పందన మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ విజయం కోసం కృషి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నూతన పాలకవర్గం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి వార్డులో పర్యటిస్తూ ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
అవినీతికి తావులేకుండా పారదర్శకమైన ప్రజాపాలన అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాబోయే పదిహేనేళ్ల పాటు చీరాలలో కూటమి జెండా ఎగురవేసేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. చీరాలలో అరాచకానికి తెరపడి అభివృద్ధికి నాంది పలికిందని, అభివృద్ధే తమ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. నూతన పాలకవర్గం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడు, హుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, చీరాల పరిశీలకులు షేక్ కరిముల్లా, జిల్లా పరిశీలకులు జంగా కృష్ణమూర్తి, టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, యువ నాయకుడు మద్దులూరి అమర్నాథ్తో పాటు కూటమి నాయకులు, నూతన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







