గుంటూరు, 2026-11-25
గుంటూరు జిల్లా ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఛార్జీలపై ప్రత్యేక రాయితీలను ప్రకటించింది, ఇవి 2026-27 వరకు అమలులో ఉంటాయి.
ప్రయాణికులకు సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) గుంటూరు జిల్లాలో ఏసీ బస్సుల్లో ఛార్జీలపై ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఈ రాయితీలు 2026 నుంచి 2027 వరకు అమలులో ఉంటాయని సంస్థ అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలో నడిచే అమరావతి ఏసీ బస్సుల్లో 20 శాతం, ఇంద్ర ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ కల్పించనున్నట్లు ప్రకటించారు.
విజయవాడ మార్గంగా హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ రాయితీలు వర్తిస్తాయని, నిర్ణీత కాలంలో ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఏసీ బస్సుల ఛార్జీల వివరాలు (రూ.ల్లో)
రాయితీ అమలులో భాగంగా వివిధ మార్గాల్లో పాత ఛార్జీలు, తగ్గించిన ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి: గుంటూరుఎంజీబీఎస్, ఎంజీబీఎస్ రూ.920 నుంచి రూ.760కు తగ్గింపు. గుంటూరుబీహెచ్ఈఎల్, బీహెచ్ఈఎల్ రూ.970 నుంచి రూ.800కు తగ్గింపు. గుంటూరుబీహెచ్ఈఎల్, బీహెచ్ఈఎల్ రూ.870 నుంచి రూ.720కు తగ్గింపు. గుంటూరుఎంజీబీఎస్, ఎంజీబీఎస్ రూ.820 నుంచి రూ.670కు తగ్గింపు.
ఇంద్ర బస్సుల ఛార్జీల వివరాలు
గుంటూరుబీహెచ్ఈఎల్, బీహెచ్ఈఎల్ రూ.700 నుంచి రూ.640కు తగ్గింపు. గుంటూరుఎంజీబీఎస్, ఎంజీబీఎస్ రూ.660 నుంచి రూ.600కు తగ్గింపు. పీఎన్ఆర్బీహెచ్ఈఎల్, బీహెచ్ఈఎల్పీఎన్ఆర్ (మల్కాజిగిరి మార్గం): రూ.760 నుంచి రూ.690కు తగ్గింపు. పీఎన్ఆర్ఎంజీబీఎస్, ఎంజీబీఎస్పీఎన్ఆర్ (మల్కాజిగిరి మార్గం): రూ.720 నుంచి రూ.660కు తగ్గింపు. తెనాలిబీహెచ్ఈఎల్, బీహెచ్ఈఎల్తెనాలి (విజయవాడ మీదుగా): రూ.770 నుంచి రూ.710కు తగ్గింపు. తెనాలిఎంజీబీఎస్, ఎంజీబీఎస్తెనాలి (విజయవాడ మీదుగా): రూ.730 నుంచి రూ.670కు తగ్గింపు. తెనాలివిశాఖపట్నం, విశాఖపట్నంతెనాలి: రూ.960 నుంచి రూ.870కు తగ్గింపు.
కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి డి. సాంబ్రాజ్యం తెలిపారు.






