క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-23
చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, నియోజకవర్గంలో దాదాపు 90 వైఎస్ఆర్సీపీకి చెందిన సర్పంచ్ మరియు వార్డ్ సభ్యుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఒక్కో అభ్యర్థి 10 నుండి 12 సెట్ల నామినేషన్లు వేసినప్పటికీ తిరస్కరణ గురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని పంచాయతీ ఎన్నికల పేరుతో ఒక్కో పంచాయతీ నుంచి 30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎమ్మెల్యే ప్రలోభాలకు తలొగ్గి తమ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అక్రమంగా తిరస్కరించారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని మోహిత్ రెడ్డి తెలిపారు.







