బాపట్ల, 2026-11-28
బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం డిస్టిక్ ట్రాస్క్ ఫోర్స్ టీము ఇంకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, మాతా శిశు సంరక్షణ సేవలపై ఆరా తీసింది.
బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి డిస్టిక్ ట్రాస్క్ ఫోర్స్ టీము, ఇంకొల్లు -3 సచివాలయ పరిధిలోని ఇంకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు సందర్శించింది. మాతా శిశు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు, బాలింతలకు అందిస్తున్న ఆరోగ్య సేవలను అంచనా వేసి, పరిశీలించి, సంబంధిత దస్తావేజులను ధృవీకరించింది. అనంతరం తగు సూచనలు, సలహాలను అందించింది. నెలవారీ హెచ్ఎంఐఎస్ నివేదికలను, ఏఎన్ఎం రికార్డులను, ఆర్సీహెచ్ పోర్టల్‌ను పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయం నుండి డిస్టిక్ డేటా ఎంట్రీ మేనేజర్ లక్ష్మణ్, స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇంచార్జ్ మల్లికార్జున, రమేష్, ఇంకొల్లు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అంజలి, సీహెచ్ఓ కోటేశ్వరరావు, పీహెచ్ఎన్, సహస్ర, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.





