గుంటూరు, 2026-11-22
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం గర్వకారణం. ఈ ముగ్గురు క్రీడాకారులు జమ్మూ కాశ్మీర్లో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం.
వివరాల్లోకి వెళితే, వెంగళ సూర్య (ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, పాత బస్టాండు, గుంటూరు) అండర్-17 బాలికల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. యం. చేతన్ సాయి (శ్రీ చైతన్య స్కూల్, నవభారత నగర్, గుంటూరు) అండర్-17 బాలుర విభాగంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఎస్. వెంకట్ ఓంకార్ ఈశ్వర్ (యాదవ జూనియర్ కళాశాల, పాతగుంటూరు) అండర్-19 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు.
ముఖ్యంగా సూర్య, చేతన్ సాయి ఇద్దరూ రెండోసారి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఇది వారి నిరంతర కృషి, పట్టుదల, క్రీడా ప్రతిభకు నిదర్శనం. స్టేడియం కోచ్ సంగీత్ బాబు, శాంతి కుమారి గారి శిక్షణలో రాణించి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి జాతీయస్థాయికి ఎంపికైన ఈ ముగ్గురు క్రీడాకారులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము.
రేపు జాతీయస్థాయి పోటీలకు బయలుదేరుతున్న ఈ ముగ్గురు క్రీడాకారులు జాతీయస్థాయిలో కూడా అద్భుత ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించి గుంటూరు జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.







