నెల్లూరు గ్రామీణం, 2026-11-27
నెల్లూరు నగర పాలక సంస్థలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా ఉద్యోగాలు కల్పించారు. మేయర్ రూప్ కుమార్ యాదవ్ వారికి నియామక పత్రాలను అందజేశారు.
నెల్లూరు నగర పాలక సంస్థ ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో అటెండర్, పబ్లిక్ హెల్త్ విభాగంలో వర్కర్ గా విధులు నిర్వహిస్తూ మరణించిన దార్ల మల్లి, ఇత్తడి రమేష్ ల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా కారుణ్య నియామకం ద్వారా వారి కుటుంబ సభ్యులు దార్ల కళ (లేట్ మల్లి భార్య), ఇత్తడి సతీష్ (లేట్ రమేష్ తండ్రి) లకు పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా విధులను కేటాయిస్తూ ఉత్తర్వులను మేయర్ రూప్ కుమార్ యాదవ్ అందజేశారు.
కార్పొరేషన్ కార్యాలయం మేయర్ ఛాంబర్ లో శుక్రవారం కారుణ్య నియామక పత్రాలను వారు మేయర్ నుంచి అందుకున్నారు.
విధుల నిర్వహణలో క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మేయర్ వారికి సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేనేజర్ రాజేశ్వరి, పబ్లిక్ హెల్త్ విభాగం సూపరింటెండెంట్ విజయ పాల్గొన్నారు.



