Palnadu/Gurazala (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 18
కలిదిండి మండలం వెంకటాపురం గ్రామంలో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. బావిని మూసివేసే పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో పంచకర్ల వెంకన్న (49) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కలిదిండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పంచకర్ల వెంకన్న (49) బావిని మూసివేసే పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన వెంకటాపురం గ్రామంలోని సుంకర రామయ్య ఇంటి వద్ద బుధవారం ఉదయం జరిగింది.
వివరాల్లోకి వెళితే, పంచకర్ల వెంకన్న అదే గ్రామానికి చెందిన సుంకర రామయ్య ఇంటి వద్ద ఉన్న పాత బావిని మూసివేసే కూలి పనికి వెళ్లాడు. పనిలో భాగంగా బావిలోని నీటిని వాటర్ మోటార్ ద్వారా బయటకు తీస్తుండగా, కాలు జారి పడబోతూ విద్యుత్ ప్రసరిస్తున్న మోటార్‌ను పట్టుకోవడంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. ఈ క్రమంలోనే బావిలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి కుమారుడు పంచకర్ల బాజీ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలిదిండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. శవ పంచనామా నిర్వహించి, కైకలూరు ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అనంతరం దర్యాప్తు చేపట్టారు.












