కారంచేడు, 5 September
విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే గురువుల సేవలను స్మరించుకుంటూ కొడవలివారిపాలెం పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పేరుగాంచిన ఇ.హనుమంతరావు గారిని పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు కలిసి సన్మానించారు.
“విద్యార్థి భవిష్యత్తుకు బాటలు వేసే గురువు, జ్ఞానాన్ని మాత్రమే కాదు… జీవితాన్ని కూడా నేర్పించే మార్గదర్శి.” జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొడవలివారిపాలెం నందు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులైన జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఇ.హనుమంతరావు గారిని సన్మానించుట జరిగినది. అందరు ఉపాధ్యాయులకు విద్యార్ధులు కృతజ్ఞతలు తెలుపుతూ మిఠాయిలు అందించారు.ప్రధానోపాధ్యాయులు ఏ. ఉమా మహేశ్వర రావు ఉపాధ్యాయులందరిని అభినందించి సత్కరించారు.












