మార్కాపురం, 2026-11-23
మార్కాపురం పట్టణంలో నూతన మున్సిపల్ చైర్మన్‌గా వక్కలగడ్డ మల్లికార్జున, వైస్ చైర్మన్‌గా కొప్పుల నాగజ్యోతి, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ కందుల రామిరెడ్డి హాజరయ్యారు.
మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మార్కాపురం మున్సిపల్ చైర్మన్‌గా వక్కలగడ్డ మల్లికార్జున, వైస్ చైర్మన్‌గా కొప్పుల నాగజ్యోతి మరియు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, మార్కాపురం జిల్లా జడ్పీ చైర్మన్ కందుల రామిరెడ్డి విచ్చేసి, నూతనంగా ఎన్నికైన వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు అభినందనలు తెలియజేశారు.
మొదటగా నాయుడు బజార్‌లోని వక్కలగడ్డ మల్లికార్జున నివాసం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు వేలాది మందితో ప్రమాణ స్వీకార మహోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ పాలక మండలి ప్రమాణ స్వీకారం జరిగింది.
నూతన పాలకవర్గంపై ఎమ్మెల్యే భరోసా
ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నమ్మి చైర్మన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 40 మున్సిపల్ కౌన్సిలర్లకు గాను 39 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారని, ఒకచోట మాత్రమే స్వల్ప తేడాతో ఓడిపోయారని తెలిపారు. ఇకపై మార్కాపురం మున్సిపల్ పట్టణాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేలాదిగా కూటమి శ్రేణులు తరలివచ్చారు.







