Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 21
కారంచేడ మండం, కొడవివారిాెం గ్రామానికి చెందిన వెనిగండ్ యామినిచంద్ గత నె 15వ తేదన గొట్టకన్న తన ఫన్న, కారంచేడ కేవం 6 రజ్నే టెక్నాజని ఉయగించి గర్తించి, బాధితడికి తిరిగి అ్గించార. ఈ విషయం బాధితడ క కృతజ్ఞత తెిార.
కారంచేడు మండలం, కొడవలివారిపాలెం గ్రామానికి చెందిన వెనిగండ్ల యామినిచంద్ (సీతారామయ్య కుమారుడు) పోగొట్టుకున్న ఫోన్ను కారంచేడు పోలీసులు కేవలం 6 రోజుల్లోనే టెక్నాలజీ సాయంతో గుర్తించి, బాధితుడికి అప్పగించారు. ఈ ఘటనపై బాధితుడు వెనిగండ్ల యామినిచంద్ గత నెల 15వ తేదీన కారంచేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు, టెక్నాలజీని ఉపయోగించి ఫోన్ను కనిపెట్టారు. అనంతరం, బాధితుడు యామినిచంద్కు ఆ ఫోన్ను తిరిగి అప్పగించే ప్రక్రియను చేపట్టారు. గౌరవనీయులైన బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు IPS ఆదేశాల మేరకు, కారంచేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్.కె.ఖాదర్ భాషా ఈరోజు బాధితుడికి ఫోన్ను అందజేశారు.
ఫోన్ తిరిగి లభించడంతో బాధితుడు యామినిచంద్ తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. కారంచేడు పోలీసులకు తన కృతజ్ఞతలు తెలిపారు.












